Which deity should I worship on Thursday, Friday : ఇంట్లో ఆర్థిక లోటు ఉండొద్దనుకునేవారు ఏం చేయాలంటే..

సంపదలకు అధిపతిగా గురు భగవానుడిని చెబుతారు. అలాంటి గురు భగవానుడి అనుగ్రహంతో మనం సంపదలకు ఎలాంటి లోటు లేకుండా బతకగలం. అదేవిధంగా శుక్రుడు కూడా.. ఆయన అనుగ్రహంతోనే మనం విలాసవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని పొందుతామట. మరి గురు, శుక్ర గ్రహాల అనుగ్రహం కోసం ఏం చేయాలి? ముఖ్యంగా గురువారం అనేది గురు భగవానుడిని పూజించుకునే రోజట. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి, గురు భగవానుడికి పసుపు రంగు పువ్వులు సమర్పించాలి. అలాగే గురు భగవానుడి అనుగ్రహం కోసం పసస పండుపై దీపం వెలిగించాలి.

ఇంట్లో ఆర్థిక లోటు ఉండొద్దనుకునేవారు ఏం చేయాలంటే..
ఇంట్లో ఆర్థిక లోటు ఉండొద్దనుకునేవారు ఏం చేయాలంటే..

గురు భగవానుడి దయ కోసం పనస పండును నానబెట్టి దండగా కట్టి పూజించాలి. అలాగే నల్ల శనగలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉడికించి గుగ్గిళ్లు తయారు చేసి ఏదైనా ఆలయం వద్ద భక్తులకు ప్రసాదంగా పంచాలి. అలాగే శుక్రుడికి అయితే తెల్ల శనగలను ఉడికించి గుగ్గిళ్లుగా తయారు చేసి భక్తులకు ప్రసాదంగా పంచాలి. గురు, శుక్రవారాల్లో గుగ్గిళ్లను పంచితే గురు, శుక్రుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ దానం వారానికి ఒకసారి లేదంటే రెండు సార్లు చేస్తే మంచిది. దీని కారణంగా మన ఇంట ధన ప్రవాహం పెరుగుతుందట. అలాగే సంపద వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends