
మధ్వాచార్యులవారు కృష్ణ భక్తిని వ్యాప్తి చేశారు. ఆయన ప్రభోదించిన మధ్వమతం దేశంలో వైష్ణవ మత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ భక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి వుంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మ ఒక్కడే. ఆయన విష్ణువు అని మధ్వాచార్యుల వారు ప్రబోధించాడు.
మధ్వ మతతత్వానికి వన్నె తెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు పెజావర, పుత్తిగె, పాలిమార్, ఆడనూరు, సోధె, కవియూరు, శిరూరు, కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు, మతపరమైన ఆచారాలకు, ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. పురందరదాసు, కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు. మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాసభగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.
