Sankranti Festival : అదృష్టం పండాలంటే…సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ పనులు చేయాలి

సంక్రాంతి పండుగ అంటే కేవలం సందడి కాదు… ఇది దైవానుగ్రహం పొందే మహా పుణ్యకాలం. భోగి రోజు పాత బాధలు, దోషాలను విడిచిపెట్టి శుభారంభం చేయాలి. తెల్లవారుజామున తలస్నానం చేసి భోగి మంట వేయడం, నువ్వుల వంటకాలు పంచడం, ఇంటి ముందు గొబ్బెమ్మలతో ముగ్గు వేయడం శుభఫలితాలు ఇస్తాయి. మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజున నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని స్నానం చేసి… శివుడికి అభిషేకం చేయడం మహాపుణ్యప్రదం. పితృదేవతలకు తర్పణం వదలడం, పెరుగు దానం చేయడం కుటుంబానికి శ్రేయస్సును ఇస్తాయి. కనుమ రోజు గోవులకు ఆహారం పెట్టడం, గోపూజ చేయడం వల్ల ధనధాన్యాలు పెరుగుతాయని నమ్మకం. మినుములతో చేసిన నైవేద్యం భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. భక్తితో ఈ పనులు నిర్వర్తిస్తే సంక్రాంతి నిజంగా అదృష్టాన్ని పండిస్తుంది.

Get Good Luck On Sankranti :
Get Good Luck On Sankranti :
Share this post with your friends