నిజమైన సంపద గురించి చెప్పే భాగవత శ్లోకమేంటంటే..

అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో చింతిస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు గీతను బోధించాడన్న విషయం సమస్త మానవాళికి తెలిసిందే. ముఖ్యంగా నిజమైన సంపద గురించి భాగవత శ్లోకమొకటి చెబుతుంది. ఇది కూడా అర్జునుడు రాజ్యం కోసమే తన వారిని హతమార్చేందుకు సిద్ధమయ్యానని విచారిస్తున్న సమయంలోనే గీత బోధిస్తోంది.

అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితాః వయమ్।

యద్ రాజ్య సుఖ

లోభేన హంతుం స్వజనం ఉద్యతాః॥

ఈ శ్లోకంలో అర్జునుడు రాజ్యం కోసమే స్వజనులను హతమార్చేందుకు సిద్ధమయ్యానని విచారిస్తాడు. అధికారం, లోభం మనసును మోహంలోకి నెడుతుందని, సంబంధాలు, కరుణలను మరిపిస్తుందని గుర్తిస్తాడు. గీత ఇక్కడ మనకు బోధిస్తున్నది ఏమిటంటే – లోకిక లాభాల కోసం బంధుత్వం, మానవతా విలువలను త్యజించడం మహాపాపం. నిజమైన సంపద ప్రేమ, కరుణ, ధర్మమే. లోభం కన్నా ధర్మం ఎల్లప్పుడూ ఉన్నతమైనది. శాంతి, ఆనందం ధర్మబద్ధమైన జీవనంలోనే లభిస్తాయి.

Share this post with your friends