ప్రేమ పేరెత్తగానే గుర్తొచ్చేది రాధాకృష్ణులే. యుగాలు మారినా కూడా వీరి ప్రేమికులనగానే రాధాకృష్ణులే గుర్తొస్తారు. మరి అంతలా ప్రేమించుకున్న ఆ జంట ఎందుకు పెళ్లాడలేదు? చాలా మందికి ఇది సందేహంగానే మిగిలిపోయింది. రాధ బృందావనానికి సమీపంలోని రేపల్లెలో నివసించేది. ఆసక్తికర విషయం ఏంటంటే.. శ్రీకృష్ణుడి కంటే రాధ పదేళ్లు పెద్దది. ప్రేమకు వయసుతో పని లేదని నాడే రాధాకృష్ణులు నిరూపించారు. వీరిద్దరూ ఎలా విడిపోయారంటే.. మేనమామ కంసుడు.. శ్రీకృష్ణుడిని మధురకు రావాలంటూ ఆక్రుడితో కబురు పంపిస్తాడు.
కృష్ణుడిని వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుపడుతున్న గోపికలను తప్పించుకుని రేపల్లెకు వెళ్లి అక్కడ రాధమ్మను కలుసుకుని కొంత సమయం అక్కడే గడుపుతాడు. అప్పుడు రాధాకృష్ణుల మధ్య మౌనం తప్ప మాటలు లేవట. ఎందుకు శ్రీకృష్ణుడు మధురకు వెళ్లాలనే విషయం రాధకు తెలుసు కాబట్టి అడ్డు చెప్పలేక మౌనం వహిస్తుందట. ఆ తరువాత కృష్ణుడు మధురకు వెళ్లిపోతాడు. ఒకసారి కృష్ణుడు తన భార్య వీర్ణతో కలిసి తోటలో ఉండటం చూసిన రాధ పట్టరాని కోపంతో దుర్భాషలాడుతుంది. ఇది నచ్చని వీర్ణ ఒక నదిగా మారి కృష్ణుడి నుంచి దూరంగా వెళ్లిపోయిందట. రాధ కూడా కృష్ణుడిపై కోపంతో ఎంతమంది నచ్చజెప్పేందుకు యత్నించినా వినలేదట. అలా కృష్ణుడికి రాధ దూరమైందని చెబుతారు.