Irumudi Importance : ఇరుముడి కట్టి మళ్లీ ఇంటికి ఎందుకు వెళ్లరాదు?

అయ్యప్ప మాలధారణ గావించిన భక్తులు యాత్రకు బయలుదేరే ముందు ఏం చేస్తారు? అయ్యప్ప మాలధారణ గావించిన వారిని స్వామిగానే అభివర్ణిస్తారు. ఇది యాత్రకు బయలుదేరే ముందు గ్రామ దేవతకు చేసే ప్రార్థన. తన కుటుంబాన్ని తాను తిరిగి వచ్చేంతవరకు కాపాడమని ప్రార్థిస్తూ, గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి, తన పరివార గణంలో ఒక గణాన్ని ఇంటి రక్షణకు ఉంచుతాడు. యాత్ర పూర్తయ్యాక తిరిగి వచ్చినప్పుడు గుమ్మం వద్ద ఉన్న దేవతకు నమస్కరించి, కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు.

Ayyappa Swamy Irumudi
Ayyappa Swamy Irumudi

కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పోయాలి?

కొబ్బరికాయపై మూడు కన్నులు – శివుని నేత్రాలు;

కొబ్బరికాయపై ఉన్న నిలువు చారలు – విష్ణు నామాలు.

అందువల్ల శివకేశవుల అంశంతో పుట్టిన అయ్యప్ప స్వామి సాక్షాత్తు కొబ్బరికాయలో ఉన్నట్లే భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడం అంటే అయ్యప్ప స్వామి అభిషేకమే అని భక్తులు నమ్ముతారు.

Share this post with your friends