
ఆచమనం చేసేటప్పుడు కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. దీనికి కారణం.. ‘కేశవ’ నామం గొంతులో నుంచి.. ‘నారాయణ’ నామం నాలిక సహాయంతో.. ‘మాధవ’ నామం పెదాల సహకారంతో వస్తుంది కాబట్టి నోటిలో అన్ని భాగాలకు వ్యాయామం అవుతుందన్నమాట. అయితే మనకు ఇంకో సందేహం కూడా వస్తుంది. ఆచమనం చేసే సమయంలో నీళ్లు చేతిలో పోసుకుని.. నోట్లో ఎందుకు పోసుకోవాలి? నేరుగా ఉద్ధరిణితోనే నోట్లో పోసుకోవచ్చు కదా.. అనే సందేహం రావొచ్చు. దానికి కూడా సమాధానం తెలుసుకుందాం.
మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. ఇది ఒక దృక్పథం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది. ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు, వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరకకపోవచ్చు.
అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ ఒకరోజుకి దొరుకుతాయి.
