ఇవాళ హనుమాన్ జయంతి.. వీటిని పొరపాటున కూడా ముట్టకండి..

ఇవాళ హనుమాన్ జయంతి. హిందూ పండుగలలో హనుమాన్ జయంతికి ప్రత్యేక స్థానముంది. అంజనీ పుత్రుడికి భక్త గణం చాలా ఎక్కువే. దేశ వ్యాప్తంగా ప్రజలు అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారమైతే హనుమాన్ జయంతి నేటి తెల్లవారుజామున 3 గంటల 25నిమిషాలకు ప్రారంభమైంది. అలాగే రేపు ఉదయం 5:18 గంటలకు ముగియనుంది. దీంతో భక్తులంతా ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆలయాల బాట పట్టారు. ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే హనుమంతుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.

హనుమాన్ జయంతి నాడు కొన్ని విషయాల్లో నియమ నిష్టలను పాటించాల్సిందే. కాబట్టి ఆంజనేయుని నిష్టతో పూజించేవారు ఇవాళ పొరపాటున కూడా మాంసాహారం ముట్టకూడదు. హనుమంతుడు పూర్తిగా శాఖహారి. ఆయనకు అసలు మాంసాహారం ఇష్టం ఉండదని చెబుతారు. అలాగే మద్యపానం చేయకూడదు. ముందుగానే అధికారులు ఇవాళ మద్యం షాపులపై నిషేధం విధించారు. హనుమంతుడికి పూజ చేసేటువంటి భక్తులు ఇవాళ పూర్తిగా మద్యం జోలికి వెల్లవద్దు. ఇక వీలైనంత వరకూ ఉపవాసం చేస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. ఈ కొన్ని రూల్స్ పాటిస్తే చాలు ఆంజనేయుని కృప మీపైనే ఉంటుంది.

Share this post with your friends