యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కొండపై స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ముందుగా గజవాహనంపై స్వామిని ఆలయ తిరువీధుల్లో విహరించి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను అర్చకులు ప్రతిష్ఠించి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. స్వామివారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఇవాళ దివ్య విమాన రథోత్సవం జరగనుంది. రేపు (20న) మహాపూర్ణాహుతి, ఛత్రతీర్థం నిర్వహించనున్నారు. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న ప్రధాన ఆలయ ఉత్తర ప్రాంతంలో నిర్మించిన లిప్టు, రథశాల ప్రాంతాల్లో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, మోకు సేవలను రద్దు చేశారు. , తిరు కల్యాణం మార్చి 19- ఉదయం శ్రీ మహా విష్ణు అలంకార సేవ, గరుడ వాహనసేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం మార్చి 20- ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ సంగమం మార్చి 21- ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార నృత్య బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.