
ఆశ్వయుజ మాసంలో శరత్ వెన్నెలలో జరుపుకునే శారదీయ నవరాత్రులే చాలా ప్రత్యేకం అంటే ఆ నవరాత్రుల్లో అష్టమి, నవమి తిథులు మరింత ప్రత్యేకమని తెులసుకున్నాం కదా. ఈ రెండు రోజుల పాటు మన ఇంట దీపాలు వెలిగిస్తే చాలా మంచిదట. మన ఇంట పాజిటివిటీ కోసం దుర్గా దేవికి పరూజ చేసిన అనంతరం పూజ గదిలో దీపం వెలిగించాలి. అలాగే ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లో పాజిటివిటీ నెలకొంటుందట.
అలాగే దుర్గాదేవి ఆశీర్వాదం కోసం అష్టమి, నవమి తిథుల్లో ఉదయం, సాయంత్రం ఈశాన్య మూలలో దీపం వెలిగించాలట. ఇది ఇంట్లో పాజిటివ్ శక్తిని ఉండేందుకు ఇది దోహదపడుతుందట. దీని వలన అమ్మవారి ఆశీస్సులు సైతం కుటుంబ సభ్యులపై ఉంటాయని నమ్మకం. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఇంట్లో డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో దీపం వెలిగించాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్థిక సమస్యలనేవే ఉండవని నమ్మకం. సాయంత్రం వేళ మెట్ల దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిదట. నెగిటివ్ ఎనర్జీ ఇంటి దరి చేరదట.
