
చార్‌ధామ్ యాత్ర ముగింపునకు వచ్చేసింది. ఇప్పటికే చార్‌ధామ్ పుణ్యక్షేత్రాల శీతాకాల మూసివేత తేదీలను ప్రకటించడం కూడా జరిగింది. అంతకు ముందు బుక్ చేసుకున్న వారిని మాత్రం ఈలోపు దర్శనానికి అనుమతించనున్నారు. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ఎప్పుడు ముగియనుందో తెలుసుకుందాం. గంగోత్రి ముందుగా మూతబడనుంది. ఆ తరువాత యమునోత్రి, కేదార్‌నాథ్ ఒకే రోజున మూసివేబయడతాయి. చివరిగా బద్రీనాథ్ తలుపులు మూసుకోనున్నాయి. ముందుగా అక్టోబర్ 22వ తేదీ పవిత్రమైన గోవర్ధన పూజ లేదా అన్నకూట్ రోజున ఉదయం 11:36 గంటలకు గంగోత్రి ధామ్ తలుపులు మూసుకోనున్నాయి.
అక్టోబర్ 23వ తేదీ భైజా దూజ్ శుభ సందర్భంగా మధ్యాహ్నం 12:30 గంటలకు పూజల అనంతరం యమునోత్రి ధామ్ తలుపులను అర్చకులు శాస్త్రోక్తంగా మూసివేస్తారు. దీని తరువాత ఆలయం తిరిగి తెరుచుకునే వరకూ అంటే ఆరు నెలల పాటు, ఖర్సాలి గ్రామంలోని ఆమె శీతాకాల నివాసంలో తల్లి యమున దర్శనం లభిస్తుంది.
ఆ తరువాత అక్టోబర్ 23న భైజా దూజ్ నాడు యమునోత్రి ధామ్, కేదార్‌నాథ్ ధామ్ తలుపులను అర్చకులు పూజలు నిర్వహించి మూసివేస్తారు. అప్పటి నుంచి ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి కేదార్‌నాథ్ బాబా దర్శనం చేసుకోవచ్చు. ముందుగా పంచ పూజలు నిర్వహించి ఆపై నవంబర్ 25న మధ్యాహ్నం 2:56 గంటలకు బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసిస్తారు. నృసింహ ఆలయ జ్యోతిర్మఠ్ నవంబర్ 26 నుండి దర్శనం కల్పిస్తుంది.
