కేరళలోని శబరిమల ఆలయంలో మండల పూజ నిర్వహణ కోసం ఏర్పాట్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మాలధారులంతా అయ్యప్ప స్వామిని దర్శించుకుని మాల అప్పగించేందుకు భక్తులంతా శబరిమలకు పోటెత్తుతున్నారు. ఇప్పటికే గత ఏడాదికి మించి ఈ ఏడాది ఆదాయం ఆలయానికి సమకూరింది. 41 రోజుల పాటు మాల ధరించి దీక్షగా ఉండి స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. మండల కాలంలో అయ్యప్ప స్వామి భక్తులు మండల పూజను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మండల పూజ నిర్వహిస్తే భక్తులకు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని నమ్మకం. ఈ క్రమంలోనే శబరిమలలోనూ మండల పూజ నిర్వహిస్తారు. అదెప్పుడో తెలుసుకుందాం.
ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీ గురువారం శబరిమల ఆలయంలో మండల పూజ పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. మండల పూజ శుభ ముహూర్తం తెల్లవారుజామున 4.54 గంటలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై సాయంత్రం 5:48 గంటల వరకూ కొనసాగనుంది. ఉదయం 11.38 గంటలకు అభిజీత్ ముహూర్తం ప్రారంభమై.. ఇది మధ్యాహ్నం 12.20 గంటల వరకూ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1:44 గంటలకు విజయ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం 2:27 వరకూ కొనసాగుతుంది. కాగా అమృత కాలం ఉదయం 8.20 గంటలకు ప్రారంభమై రాత్రి 10.07 గంటల వరకు కొనసాగుతుంది. ఇంత మంచి ముహూర్తాలున్నాయి కాబట్టి ఈ రోజున మండల పూజ నిర్వహించనున్నారు.