నడక దారిలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు

అలిపిరి నడక మార్గంలోని మోకాలి మిట్ట వద్ద సోమవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నడక మార్గంలోని మరుగుదొడ్లను పరిశీలించి అక్కడున్న సిబ్బందిని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అంబులెన్స్ సర్వీసును పరిశీలించి ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. తిరుమలకు వస్తున్న భక్తులతో మాట్లాడి నడక దారిలో టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు నిర్వహించారు. అక్కడ భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదంపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు.

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

హీరో మోటో కార్ప్ కంపెనీ సోమవారం రూ.1.20 లక్షలు విలువైన హీరో డెస్టినీ వాహనాన్ని సోమవారం టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి పూజలు నిర్వహించి ఆ సంస్థ ప్రతినిధి శ్రీ నవజ్యోత్ శంకర్ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఐ శ్రీ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

Share this post with your friends