
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారికి టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎనిమిదో రోజైన గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారు మహారాణీ అవతారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. టీటీడీ ఈవో చేతులు మీదుగా చైర్మన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గురువారం ప్రారంభించారు. ఇటీవలే చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చిన్నపాటి మరమ్మతులు చేయడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ హరీంద్రనాథ్, శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
