జాపాలి హనుమాన్ కు టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పణ

హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ తరుపున చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గురువారం ఉదయం పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేకం పూజలు నిర్వహించిన అనంతరం సింధూర వస్త్రంతో చైర్మన్ ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులోని ఆరామ మారుతి నిలయ అభయారణ్య ఆంజనేయ స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు టిటిడి ఛైర్మన్ చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్ ఆహ్వానం మేరకు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

Share this post with your friends