భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు

భద్రాద్రి రామయ్య ఆలయం టీటీడీ చేతుల్లోకి వెళ్లింది. ప్ర‌తి ఏడాది శ్రీ సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించేందుకు స‌ర్వంగా సుంద‌రంగా క‌ల్యాణ వేదిక, క‌ల్యాణాన్ని వీక్షించే భ‌క్తుల సౌక‌ర్యార్థం షెడ్లు, మ‌రుగుదొడ్లు, యాత్రీకుల వ‌స‌తి స‌ముదాయాలు నిర్మించారు. అదేవిధంగా ఆల‌య లోప‌ల పోటు, యాగ‌శాల‌, ప‌రిస‌రాల మ‌ర‌మ్మ‌త్తులు, నూత‌న పుష్క‌రిణి, వాహ‌న మండ‌పం నిర్మాణం, మాడ వీధుల‌లో సిసి రోడ్లు, డ్రైనేజి త‌దిత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఆల‌యానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత అహ్లాద‌క‌ర ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు ప‌రిస‌రాల‌లో ప‌చ్చ‌ద‌నం పెంపొందించారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు ఆధ్వ‌ర్యంలో, జెఈవో శ్రీ వి. వీర‌బ్ర‌హ్మం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఏప్రిల్ 11న‌ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పున్న‌మి వెలుగులో అత్యంత వైభ‌వంగా శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని నిర్వ‌హించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. క‌ల్యాణానికి విచ్చేసే ల‌క్ష‌లాధి మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, అన్న‌ప్ర‌సాదాలు, భ‌ద్రాత‌, ర‌వాణా, వైద్యం, పారిశుద్ధ్యం, పార్కింగ్ త‌దిత‌ర అంశాల‌పై టీటీడీ, జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకొని ఏర్పాట్లు చేస్తోంది.

రాములవారిపై సాహిత్యం :

ఎందరో మహాకవులు తన సాహిత్యం ద్వారా శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులయ్యారు. పోతన ఇక్కడే భాగవతాన్ని అనువదించినట్టు తెలుస్తోంది. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పారు. రామభద్రుడు ‘రామాభ్యుదయం’ రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు. ఉప్పు గొండూరు వేంకటకవి ఒంటిమిట్ట రశరథరామ శతకం చెప్పారు. వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణాన్ని మందర వ్యాఖ్యతో రచించారు. తాళ్లపాక అన్నమయ్య రామునిపై పలు సంకీర్తనలు ఆలపించారు.

Share this post with your friends