ఇవాళే మకర జ్యోతి దర్శనం.. తిరువాభరణం

ఇవాళే శబరిమలలో మకరజ్యోతి దర్శనం. దీనినే మకరవిళక్కు అని కూడా అంటారు. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన వార్షిక వేడుక ఇది. దీనికోసం పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు వెళతారు. జ్యోతి దర్శనం చేసుకుంటే ఇక జీవితంలోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయని నమ్మకం. అక్కడి వరకూ వెళ్లలేని వారు లైమ్ స్ట్రీమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దర్శించుకుంటారు. ఇవాళ సాయంతో సూర్యాస్తమయ సమయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఆకాశంలో నక్షత్రం మాదిరిగా కనిపించే ఈ కాంతిని దర్శించుకుని భక్తులు తరిస్తుంటారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల నడుమ మకరజ్యోతి దర్శనాన్ని వీక్షించవచ్చు.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. మకరవిళక్కు అనేది పొన్నంబలమేడు అడవిలో ఉన్న మలయమాన్ కారి వారసులుగా భావించబడే మలయరాయ తెగ వారు పూర్వకాలం నుంచి ఆచరిస్తున్న మతపరమైన ఆచారంలో ఒక భాగం.ఈ పండుగలో తిరువాభరణం అంటే అయ్యప్ప స్వామికి అలంకరించే పవిత్ర ఆభరణాలను ఊరేగిస్తారు. ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మకర జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప కి అలంకరించే ఆభరణాలను పందళం నుంచి తీసుకుని శబరిమలకు పయనం అవుతారు. ఈ ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పందళ వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలను తయారు చేయించి ప్రతి సంవత్సరం జ్యోతి దర్శనం రోజున అలంకరిస్తారు. ఈ బంగారు ఆభరణాల ఊరేగింపు పందళ రాజ్యం నుంచి 3 రోజుల పాటు ప్రయాణం చేసి రేపు సాయంత్రం అయ్యప్ప సన్నిదానానికి చేరుకుంటుంది.

Share this post with your friends