నేడు మాఘపూర్ణిమ.. ఇది ఎంత విశిష్టమైనదంటే..

నేటి మాఘ పూర్ణిమ సామాన్యమైనది కాదు. ఆధ్యాత్మిక పరంగా మహా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు ఒకే సమయంలో కొన్ని అరుదైన పుణ్యయోగాలు కలిసివచ్చాయి. భక్తులకు అపూర్వ వరం. మాఘ పూర్ణిమ అనేది చంద్రుని శక్తి పరాకాష్టలో ఉండే పవిత్ర తిథి. ఈ రోజు చేసే నదీ స్నానం కోటి జన్మల పాపాలను హరిస్తుందని శాస్త్రం చెబుతోంది. ప్రయాగలో ఈ రోజున సమస్త దేవతలు స్నానం చేస్తారని పురాణ విశ్వాసం. కార్తీక పౌర్ణమి దీపారాధన ఎంత గొప్పదో, మాఘ పౌర్ణమి స్నానం అంతకు పది రెట్లు విశిష్టం.

అంతటి విశిష్టమైన ఈ రోజున నదీ స్నానం కానీ లేదంటే సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదని చాలా మంది అంటే తమకు వీలుపడిన వారు నదీ, సముద్ర స్నానాలు గావించారు. అలా వీలుపడని వారు ఇంట్లోనే గంగా–యమునాది నదులను స్మరిస్తూ సూర్యోదయంలో స్నానం చేశారు. ఇవాళ రవి పుష్య యోగం (పుష్యార్క యోగం) అంటే ఆదివారం + పుష్యమి నక్షత్రం కలయికతో ఏర్పడే అరుదైన యోగం. దీని కారణంగా ఈ యోగంలో చేసే స్నానం, దానం, జపం వంటివి అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. గ్రహణ సమాన శక్తి కలిగిన శుభయోగం ఇది.

Share this post with your friends