తిరుమల అప్డేట్ | 28th March 2024

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 64 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24వేల 500మంది తలనీలాలు సమర్పించుకోగా..స్వామివారికి హుండీ ఆదాయం 3కోట్ల 72లక్షలు లభించింది. తిరుమలలో గురువారం కూడా దాదాపు అదేస్థాయిలో రద్దీ కొనసాగుతోంది. తిరుమలకు నడకదారిలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. దీంతో అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేసింది తితిదే. నడకమార్గంలో కొండపైకి చేరుకుంటున్న భక్తులకు రక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది.

Share this post with your friends