కోసువారిపల్లి ప్రసన్న వేంకటరమణ స్వామి వారి ఆలయ రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి వారి ఆలయ రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికలను తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈవో ఛాంబర్‌లో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తంబళ్ళపల్లి మండలం కోసువారి పల్లి గ్రామం నందు శ్రీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి ఆలయం రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరగనుంది.

వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుండి 12 వరకు జరుగుతాయని టీటీడీ జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం తెలిపారు. రాజగోపుర ప్రతిష్ట మహోత్సవానికి జనవరి 29న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ కార్యక్రమాలు జరుగనుండగా, ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం చతుస్తానార్చన, మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం ఉదయం 9.30 నుండి 10.15 వరకూ కుంభప్రోక్షణ, శాత్తుమొర, నివేదన, మంగళహారతి, ఆచార్య బహుమానం కార్యక్రమాలు జరుగనున్నాయి.

Share this post with your friends