
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించే ఈ కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, కల్యాణ వేదిక సమీపంలో ట్రాఫిక్ , భధ్రతా, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిక, స్వామివారి తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు
06.04.2025 (శ్రీరామ నవమి) – వృషభ లగ్నంలో ఉదయం 9.30 – 10.15 గంటల మధ్య ధ్వజారోహణం, సాయంత్రి 7 గంటలకు శేష వాహనం
07-04-2025 వేణుగాన అలంకారం హంస వాహనం
08-04-2025 వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
09-04-2025 నవనీతకృష్ణ అలంకారం హనుమంత వాహనం
10-04-2025 మోహినీ అలంకారం గరుడసేవ
11-04-2025 శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రాత్రి 8.30 గంటలకు), గజవాహనం.
12.-04-2025 రథోత్సవం
13-04-2025 కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
14-04-2025 చక్రస్నానం ధ్వజావరోహణం(రాత్రి 7 గంటలు)
15-04-2025 ——– పుష్పయాగం (సాయంత్రం 6 గంటలు).
