శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్యకల్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ, యజ్ఞొపవీత పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి… వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
2024-03-31