అయోధ్యలో బాలరామయ్యను చూస్తున్నట్టుగా ఉడుత విగ్రహం..

అయోధ్యలో రామాలయ నిర్మాణం చివరి దశకు వచ్చేసింది. ఈ సమయంలో ఒక ఆసక్తికర విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామాయణంలో ఉడుత పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అయోధ్యలో ఉడుత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంగద్ తీలా వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అయోధ్య రామాయంలోని బాలరామయ్యను చూస్తున్నట్టుగా ఈ ఉడుత ఉంటుంది. రామ సేతు నిర్మాణ సమయంలో ఉడుత రాముడిపై అపరిమితమైన భక్తిని ప్రదర్శించిందట. అలాగే రామకార్యం పూర్తి చేసేందుకు తనవంతు కృషి చేసిందట.

వాల్మీకి ప్రకారం చెప్పాలంటే.. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లిన సమయంలో ఆమెను చేరుకునేందుకు రామ సేతు నిర్మాణం గావిస్తున్నప్పుడు వానర సేన పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకెళుతోందట. అప్పుడు ఉడుత తన వంతు చిన్న చిన్న గులకరాళ్లను మోసుకెళ్లింది. మొత్తానికి రాములవారిపై భకత్ితో తన వంతు సాయం అందించిందట. ఉడుత సాయం అందిస్తున్న సమయంలో దానిని వానర సేన ఎగతాళి చేసిందట. రాళ్లు కింద పడితే సమాధి అయిపోతావని.. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాయి. అప్పుడు రాములవారు ఉడుత సాయం గురించి వానరసేనకు వివరించాడట. ఉడుత వేసిన గులకాళ్లు వంతెనను మరింత బలోపేతం చేస్తాయని శ్రీరాముడు వివరించాడు. అప్పుడు వానరాలు తమ తప్పుకు క్షమాపణ కోరాయట. అందుకే ఉడతా భక్తి అనే పదాన్ని ఇప్పటికీ వాడుతూ ఉంటారు.

Share this post with your friends