శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రసాదానికి కొరత ఏర్పాడింది. శబరిమల ప్రసాదాన్ని ప్రత్యేక డబ్బాలలో ఇస్తారు.. అయితే, ఇప్పుడు ఆ డబ్బాలకు కొరత ఏర్పడింతో.. ప్రసాదంపై ట్రావెన్ కోర్ దేవస్థాన్ బోర్డు ఆంక్షలు విధించింది. శబరిమలకు వచ్చే ఒక్కో భక్తుడికీ కేవలం రెండు డబ్బాలు మాత్రమే ఇస్తామని వెల్లడించింది. అయితే, అయ్యప్ప భక్తులకు 2 డబ్బాలు ఏమాత్రం సరిపోవు అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బాల కొరత, ప్రసాద పంపిణీకి అనేక చిక్కులు తెచ్చిపెడుతోంది.
అయితే, ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. ఆలయం దగ్గర విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. కిలోమీటర్ల మేరా క్యూ లైన్ ఉంటోంది. ఇక, సంక్రాంతి సమయంలో మకర జ్యోతిని చూసేందుకు స్వాములు పెద్ద ఎత్తున వెళ్లే అవకాశం ఉంది. ఇలా వెళ్లిన భక్తులు భారీ సంఖ్యలో ప్రసాదం కొనుగోలు చేస్తారు.. దాంతో ప్రసాదం డబ్బాల వాడకం బాగా పెరిగిపోయింది. కానీ కొత్త డబ్బాల తయారీ మాత్రం ఆలస్యం అవుతుంది. ఇక, ఉన్న డబ్బాలను జాగ్రత్తగా అందరికీ వచ్చేలా చెయ్యాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఒక్కో అయ్యప్ప స్వామికీ రెండు డబ్బాలే ఇస్తామని ప్రకటించింది. అయితే, ట్రావెన్ కోర్ దేవస్థానం ఈ విషయం చెప్పడంతో అయ్యప్ప భక్తులకు నిరాశ కలిగిస్తుంది. సాధారణంగా ప్రతీ స్వామీ కనీసం 10 డబ్బాలైనా కొనుగోలు చేస్తారు. దేవస్థానం బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకొని ఎక్కువ డబ్బాలు ఇవ్వాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్వాములు వేడుకుంటున్నారు.