మహా కుంభమేళా కోసం సిద్దమైన రోబోలు

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభమేలా వచ్చే ఏడాది 2025 జనవరి 13న ప్రారంభం కానుంది. దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళంగా మహా కుంభమేళాను భావిస్తారు. కాబట్టి దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహా కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్‌ సెఫ్టీ విభాగం పటిష్ట చర్యలు చేపడుతోంది.

ఈ క్రమంలోనే రోబోట్లను సైతం ఏర్పాటు చేశారు. ఇవి కుంభమేళాలో జరిగే అనర్థాలను అడ్డుకుంటాయని అధికారులు వెల్లడించారు. అలాగే ఆధ్యాత్మిక సమ్మేళనం సురక్షితంగా నిర్వహించడానికి 200 మంది అగ్నిమాపక కమాండోలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హైదరాబాద్లో శిక్షణ పొందిన అగ్నిమాపక సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించనున్నట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజా చౌహాన్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితి సంభవించినప్పుడు సిబ్బంది చేరలేని ప్రదేశాలు ఏవైనా ఉంటే వాటికి రోబోటిక్ ఫైర్ టెండర్లను పంపిస్తామని అదికారులు తెలిపారు. అవి ఒక్కొక్కటి 20-25 కిలోల బరువుతో ఉంటాయి. ఆ రోబోట్లు మెట్లు కూడా ఎక్కి మంటలను అదుపు చేస్తాయి.

Share this post with your friends