మహా కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్..

మహా కుంభ మేళాకు తేదీ ఖరారైంది. మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి కోట్ల సంఖ్యలో జనాలు హాజరు కానున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుంభ మేళా కోసం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తోంది. ఏకంగా 992 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే మౌళిక సదుపాయాలు, ప్రయాణికులకు సౌకర్యాల కల్పన వంటి కార్యక్రమాల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ రూ.993 కోట్లను కేటాయించింది.

అలాగే రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాక్‌ల మరమ్మతు పనులను సైతం చేపడుతోంది. ప్రయాగ్‌రాజ్ డివిజన్, దాని పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.3,700 కోట్లతో రైల్వే ట్రాక్‌ల డబ్లింగ్ పనులను రైల్వే శాఖ నిర్వహిస్తోంది. మహా కుంభమేళాకు 2019లో రూ.24 కోట్ల మందికి పైగా హాజరవగా.. జనవరిలో జరగనున్న కుంభమేళాకు రూ.30 నుంచి రూ.50 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో హాజరయ్యే భక్తుల కోసం 5వేల సాధారణ, అదనంగా 694 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

Share this post with your friends