తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తే.. తమిళులు సౌరమానాన్ని అనుసరిస్తారు. ఈ క్రమంలోనే తమిళ పంచాంగం ప్రకారం అయితే వారికి కొత్త మాసం అనేది పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ద పాడ్యమి నాడు తమిళులు నూతన సంవత్సరం ఉగాదిని జరుపుకుంటారు. అది ఎప్పుడో కాదు.. ఇవాళే. తమిళ నూతన సంవత్సరాదిని ‘పుతుండు’గా జరుపుకుంటారు. ఈ పండుగను తమిళ ప్రజలు ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. పుతుండుని మరో పేరుతో కూడా పిలుస్తారు. అదే ‘వరుష పిరప్పు’ అని కూడా పిలుస్తారు.
తమిళ పదాలు పుతు, అండు అనే రెండు పదాల కలయికే పుతుండు. దీని అర్థం పుతు అంటే కొత్తది.. అండు అంటే నూతన సంవత్సరమని అర్థం. మనం ఉగాదిని ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటామో పుతుండును తమిళులు అంతే వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను తమిళ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర వేడుకను జరుపుకుంటారు. ఈ పండుగను ఒక్క తమిళనాడు వాసులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు దీనిని జరుపుకుంటారు. ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే మేష సంక్రాంతిని తమిళులు కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు.