భద్రాచలం రామయ్య ఆలయంలో ప్రసాద్‌ పథకం పనులు

భద్రాచలం రామయ్య ఆలయం మరింత శోభాయమానం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్‌ పథకం కింద తలపెట్టిన పనులు ప్రారంభమయ్యాయి. క్షేత్రంతోపాటు, పర్ణశాల ప్రాంతం, గోదావరి కరకట్ట పరిసరాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పనుల స్థితిగతులను పరిశీలించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యన్ భద్రాచల ఆలయ ప్రాంగణంతోపాటు పర్ణశాల ప్రాంతాన్ని సందర్శించారు. తదుపరి ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఈవో రమాదేవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends