23న మంథనిలో సామూహిక గీతా పారాయణ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర సనాతన ధర్మ ప్రచార సమితి, శ్రీసీతారామ సేవాసదన్ ల సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఎత్తున సామూహిక గీతా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంథనిలోని శివకిరణ్ గార్డెన్స్ లో ఈనెల 23న ఆదివారం ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ క్రమంలోనే భగవద్గీత విజయోత్సవ ఆహ్వాన పత్రికలు సైతం ఆవిష్కరించారు. మంథనిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సనాతన ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంథెన శ్రీనివాస్‌తో కలిసి వొడ్నాల శ్రీనివాస్ బృందం పాల్గొంది. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగని విధంగా వేదగడ్డగా నిలిచిన మంత్రపురిలో గీతా పారాయణం నిరవ్హించడం విశేషమన్నారు. అక్కడ 665 రోజులపాటు నిరంతరాయంగా 665 ఇళ్లలో గీతా పారాయణాన్ని నిర్వహించామని తెలిపారు.

ఈ క్రమంలోనే ఈనెల 23న మంథనిలో జరిగే కార్యక్రమంలో 5 వేల మంది భక్తులతో సామూహిక గీతా పారాయణాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రవచకులుగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, విశిష్ట అతిథిగా సిఎల్ విజయరాజం తో పాటు పలువురు వక్తలు హాజరుకానున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి స్వామిజీలు సైతం హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం నుంచి ఉదయం 8:30 గంటలకు శోభయాత్రను నిర్వహించనున్నట్టు వెల్లడింాచరు. అనంతరం శివ కిరణ్ గార్డెన్స్ లో భారీ సామూహిక గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

Share this post with your friends