తిరుమల శ్రీవారి ఆలయానికి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే చెప్పడంతో ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికే కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న వార్త కొన్ని నెలల క్రితం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎంక్వైరీ కమిటీని సైతం వేయడం జరిగింది. ఆ తరువాత తిరుమలలో నెయ్యి వ్యవహారంతో పాటు ఇతర విషయాల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఆయన్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులను సిట్‌ విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ పీఏతో పాటు పలువురిని విచారించడం ఆసక్తికరంగా మారింది. అరెస్ట్ అయిన వారిలో నెయ్యి సప్లై చేసిన డెయిరీ యజమానులతో పాటు ఉద్యోగులు సైతం ఉన్నారు.

Share this post with your friends