కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో దర్శనమిస్తుండగా, మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తికి విశేష పూజలు చేశారు. అనంతరం మోహిని రూపంలో అలంకరించి… పల్లకీ సేవ నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.
2024-03-28