
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం తిరుమలలోని నాదనీరాజనం, ఆస్థాన మండపంలలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీమతి లక్ష్మీ సువర్ణ, శ్రీ మల్లేశ్వరరావు, శ్రీ నాగరాజు, శ్రీ రవికుమార్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 నుండి 2.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీ నరసింహ నాయక్ బృందం భక్తి సంగీతం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటరమణ బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ సురేష్ బాబు భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12:30 గంటల వరకు నంద్యాలకు చెందిన శ్రీ దీవి హయగ్రీవ చార్యులు భక్తి సవదేశం అందించారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు కడపకు చెందిన శ్రీ వాణి అర్జున్ బృందం అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించింది. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు కర్నూల్ కు చెందిన శ్రీ రవి ప్రసాద్ రాజు బృందం హరికథ గానం చేశారు.
