గోవింద నామంతో మార్మోగిన వాడపల్లి క్షేత్రం

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడు శనివారాల వేంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో 50 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందా గోవిందా అంటూ భక్తులు నినదించారు. దీంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

Share this post with your friends