ప్రతి హిందువూ తప్పనిసరిగా తమ జీవితంలో చేయాలనుకునే యాత్రలు కొన్ని ఉంటాయి. వాటిలో కైలాస మానస సరోవర యాత్ర కూడా ఒకటి. దీనిని జీవన్ముక్తి యాత్ర అని.. జీవిన సాఫల్య యాత్ర అని కూడా చెబుతారు. ఈ ప్రయాణంలో మనకు తెలియని ఏదో రహస్యం అయితే ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. జగ్గీ వాసుదేవ్ ప్రకారమైతే.. కైలాస మానస సరోవర యాత్ర చూడటానికే కాదు.. చదవడానికి కష్టమే. మరి అలాంటి యాత్ర చేయాలని ఎవరికి ఉండదు. ఆ తరుణం ఆసన్నమైంది. కరోనా, చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా గత ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస మానస సరోవర యాత్రకు చైనా అనుమతి ఇచ్చింది.
2020లో చివరిసారిగా కైలాస పరిక్రమణ, మానస సరోవర యాత్రకు చైనా అనుమతి ఇచ్చింది చైనా. ఆ తరువాత భక్తులకు ఈ యాత్ర చేసే అదృష్టం కలగలేదు. మళ్లీ ఇన్నాళ్లకు.. చైనాతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జరిపిన చర్చల ఫలించడంతో యాత్రకు మార్గం సుగమమైంది. వచ్చే మే లేదంటే జూన్ నెలల్లో యాత్ర మొదలు కావొచ్చని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావాల్సి ఉంది. అవి పూర్తైరే చక్కగా ఈ యాత్రను మొదలు పెట్టవచ్చు. ఈ యాత్రకు వెళ్లాలని ఎప్పటి నుంచో భావిస్తున్నవారికి ఇది శుభవార్త అని చెప్పాలి.