24న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో గ‌జ‌వాహ‌న సేవ‌

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఎప్పుడూ ఏవో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే మార్చి 24వ తేదీ గ‌జ‌వాహ‌న‌ సేవ వైభ‌వంగా జరుగనుంది. ప్రతి నెలా ఉత్త‌రాషాడ న‌క్ష‌త్రం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం గ‌జ‌వాహ‌న‌ సేవను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై విహ‌రిస్తూ భక్తులను కటాక్షించ‌నున్నారు. తిరుచానూరు వేంకటేశ్వరుని ప్రియ సతీమణి శ్రీ పద్మావతి దేవి నివాసం.

ఈ పుణ్యక్షేత్రం అలమేలుమంగాపురం అంటే అలర్-తామర పువ్వు, మెల్-పైన, మంగా-దేవత, పురం-ఊరు అని అర్థం. ఇది కాలక్రమంలో అలిమేలుమంగాపురంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ పురాణం ప్రకారం.. ఆలయ అవరణలో ఉన్న ట్యాంక్ (పద్మసరోవరం) మధ్యలో పద్మావతి దేవి బంగారు కమలంపై మహాలక్ష్మి దేవిగా ఉద్భవించింది కాబట్టి, ఈ ప్రదేశం అలమేలుమంగాపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. తీర్థయాత్రల సమయంలో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించిన తర్వాతనే ఫలప్రదం కలుగుతుందని చెబుతారు.

Share this post with your friends