
తిరుమలలో కల్యాణ వేదిక వద్ద ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శన ప్రతిబింబించేలా తిరుమల తిరుపతి దేవస్థానం దీనిని ఏర్పాటు చేసింది. తిరుమలలో రవాణా, క్యూ లైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆయుర్వేద, అటవీ శాఖ, శిల్పకళాశాల ఏర్పాటు చేసిన స్టాల్స్ అద్భుతంగా ఉంది. టీటీడీ పబ్లికేషన్స్, అగరబత్తి స్టాల్స్‌ను సైతం ఏర్పాటు చేయడం జరిగింది.
గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్ప అలంకరణలు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అదేవిధంగా, బెంగళూరుకు చెందిన కళాకారిణి గౌరి రూపొందించిన సైకత శిల్పం మరో అద్భుతమని చెప్పాలి. ఆనందనిలయ విమాన వెంకటేశ్వరుని మోసుకెళ్తున్న మహాగరుడ రూపకల్పన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిపై టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు సైతం స్పందించారు. ప్రతికూల అంశాలు ఏమైనా ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని, వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు సూచించారు. స్వామి అనుగ్రహంతో భక్తులందరూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు.
