మే 10 నుంచి శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు

తిరుపతిలో మే 10 నుంచి శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మే 10 నుంచి 12వ తేదీ వరకూ శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ సంద‌ర్భంగా ఈ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది. మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కూ శ్రీ భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మే 10వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగ‌ళ శాస‌నాల‌తో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం తిరుప‌తికి చెందిన ఆచార్య చ‌క్రవర్తి రంగనాథన్‌ ‘‘ శ్రీ రామానుజ వైభవం” పై ఉపన్యసిస్తారు. త‌రువాత తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి రేవ‌తి బృందం భ‌క్తి సంగీత కార్యక్రమం జ‌రుగ‌నుంది. ఆదిశేషుని అవతారమైన భగవద్‌ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడు. భగవద్‌ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారు.

Share this post with your friends