ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. అయితే ఈ నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. నిజాం హయాంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు. అయితే ఆదివాసులకు నాగరికులంటేనే భయం.. వారి దగ్గరకు ఎందుకోగానీ అధికారులెవరూ వెళ్లేవారు కాదు. ఆ సమయంలోనే అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ ఘటన ఆదివాసుల హృదయాల్లో కల్లోలం రేపింది. ఆ సమయంలో నిజాం రాజులు గిరిజన ప్రాంతాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్‌ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు.
ఆ తరువాత నుంచి నిజాం సర్కార్ ఈ జాతరపై దృష్టి పెట్టింది. గిరిజనులు తమకు ఏమైనా సమస్యలు తలెత్తితే కొండలు, కోనలు దాటి రావాల్సి వచ్చేది. అలాంటి వారి కోసం వారి వద్దే ఏదైనా దర్బార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిజాం సర్కార్ భావించింది. ఈ క్రమంలోనే జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ జాతరను 1946లో ప్రారంభించారు. స్వాతంత్ర్యం కోసం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ దర్బార్ జాతర చివరి రోజున జరుగుతుంది. ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతుంటారు.