శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి 3 గంటలు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. క్షేత్రమంతా భక్తజనంతో కోలాహలంగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి విచ్చేశారు. వేకువజామునుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు స్పర్శ దర్శనానికి గంట సమయం పట్టింది.

శ్రీశైలం క్షేత్రంలో ఏప్రిల్ ఆరో తేదీనుంచి 10వ తేదీ వరకు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఉగాది వేడుకలపై ఆయన శ్రీశైలం ఈవో పెద్దిరాజుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు తాగునీరు పారిశుధ్యం పార్కింగ్ ప్రదేశాలు భక్తుల దర్శన క్యూలైన్లు లడ్డూల ప్రసాద కౌంటర్లు తదితర అంశాలపై చర్చించారు. భక్తులకు ఎలాంటి లోటు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Share this post with your friends