వేసవి సెలవులు వస్తే చాలు పిల్లలకు సెలవులు వస్తాయి కాబట్టి ఎటో ఒకవైపు టూర్ వేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు కానీ బడ్జెట్ ఒక అడ్డంకిగా మారుతుంది. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. గురుకృప యాత్ర పేరిట సాగే ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఉత్తర భారత దేశంలోని పలు దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లుగా సాగనుంది. ఆనంద్‌పుర్ సాహిబ్, నైనా దేవి, శ్రీ మాత వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్‌లను ఈ ప్యాకేజీలో సందర్శించవచ్చు. ప్రస్తుతం ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.
ప్రయాణ వివరాలేంటంటే..
మొదటి రోజు: ఉదయం 8 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ బయలుదేరుతుంది. గుంటూరు నుంచి తెలంగాణలోని నల్లగొండ, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, కాజీపేట, సికింద్రాబాద్ మీదుగా వెళుతుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా పర్యాటకులు యాత్రకు బయలుదేరవచ్చచు. ఇక ఈ ట్రైన్ మూడో రోజు ఉదయానికి హరిద్వార్ చేరుతుంది. అక్కడ హోటల్‌లో చెకిన్ అయిన మీదట ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి మానసా దేవి ఆలయాన్ని సందర్శించుకుని అక్కడ గంగా హారతి వీక్షించి అక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు ఉదయం గంగా స్నానం చేసి అక్కడి నుంచి బయలుదేరి రిషికేష్‌కు వస్తారు. అక్కడ రామ్ ఝులా, లక్ష్మణ్ ఝులా ఆలయాలను దర్శించుకుని తిరిగి రిషికేష్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆనంద్‌పూర్ సాహిబ్‌కి ప్రయాణం అవుతారు. ఐదో రోజు సాయంత్రానికి ఆనంద్‌పూర్ సాహిబ్‌కు చేరుకుని అక్కడ ఫ్రెషప్ అప్ అయ్యి గురుద్వార్ చూసి తర్వాత నైనా దేవి ఆలయానికి వెళతారు. అక్కడి నుంచి అమృత్‌సర్, గోల్డెన్ టెంపుల్, వాఘా బోర్డర్ చూస్తారు. రాత్రికి అమృత్‌సర్ రైల్వే స్టేషన్ నుంచి వైష్ణోదేవి దర్శనానికి బయలుదేరుతారు. ఏడో రోజు కత్రా రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మీదట హోటల్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వైష్ణోదేవి ఆలయానికి వెళతారు. ఈ రోజు రాత్రికి అక్కడే స్టే చేస్తారు. ఎనిమిదో రోజు మాతా వైష్ణోదేవి కత్రా రైల్వే స్టేషన్ కు చేరుకొని టూర్ ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. తొమ్మిదో రోజు మొత్తం ప్రయాణం చేసి పదో రోజుకు మీ గమ్యస్థానానికి చేరుకుంటారు.
టికెట్ ధరలు..
స్లీపర్ క్లాస్ (ఎకానమీ) అయితే పెద్దలకు రూ.18,510, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.17,390
థర్డ్ ఏసీ (స్టాండర్డ్ )లో పెద్దలకు రూ.30,730.. 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు రూ.29,420
సెకండ్ ఏసీ (కంఫర్ట్ )లో పెద్దలకు రూ.40,685, 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు రూ.39,110
ప్యాకేజీలో భాగంగా హోటల్‌లో బసతో పాటు స్థానికంగా తిరిగేందుకు వాహనం ప్రయాణ భీమా సదుపాయం, ఉదయం టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ వంటివి అందిస్తారు.