సత్య ప్రమాణాల స్వామిగా ప్రసిద్ధి చెందిన వరసిద్ధి వినాయకుడు కాణిపాకంలో స్వయంభువుగా వెలిసిన విషయం తెలిసిందే. ఇది అతి ప్రాచీనమైన వినాయక క్షేత్రం. న భాద్రపద శుద్ధ చవితి రోజును వినాయక చవితిగా జరుపుకుంటామన్న విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీన దేశ వ్యాప్తంగా వినాయక చవితిని జరుపుకోనున్నాం. ఇక కాణిపాకం 7వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 16 వ తేదీ వరకూ జరగనున్నాయి. 16 తరువాత కూడా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం సిద్ధమైంది. తన వాహనమైన మూషికంపై సెప్టెంబర్ 10న వినాయకుడు ఊరేగనున్నాడు. అలాగే 14వ తేదీన వైభవంగా రథోత్సవం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలు.
సెప్టెంబర్ 7న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
సెప్టెంబర్ 8న ధ్వజారోహణం, హంసవాహన సేవ
సెప్టెంబర్ 9న నెమలి వాహన సేవ
సెప్టెంబర్ 10న మూషిక వాహన సేవ
సెప్టెంబర్ 11న శేష వాహనసేవ
సెప్టెంబర్ 12న చిలుక వాహనం, వృషభ వాహన సేవ
సెప్టెంబర్ 13న గజ వాహన సేవ
సెప్టెంబర్ 14న రథోత్సవం
సెప్టెంబర్ 15న బిక్షాండి, తిరుకళ్యాణం, అశ్వవాహన సేవ
సెప్టెంబర్16న ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, బ్రహ్మోత్సవాల ముగింపు