అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన శ్రీ వేదాల రంగనాథ్, శ్రీమతి కృష్ణ కుమారి దంపతులు ఎస్వీ అన్నప్రసాదం, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్‌కు విరాళం అందజేశారు. ఈ క్రమంలోనే వేదాల రంగనాథ్ దంపతులు తిరుమలకు సోమవారం సోమవారం ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.లక్ష విరాళం అందించారు. ఈ మేరకు తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించారు.
2025-05-27