రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువుకట్టపై భారీ హనుమాన్ విగ్రహాన్ని నిర్మించనున్నారు. 108 అడుగుల ఎత్తులో పంచముఖ ఆంజనేయుడు ఇక్కడ కొలువుదీరనున్నాడు. విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ తదితరులు పాల్గొన్నారు.
2024-03-30