వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజాగది ఏర్పాటుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలా మంది వంటగది పక్కనే పూజామందిరం ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇది వాస్తు దోషానికి కారణమవుతుందని శాస్త్రం చెబుతోంది. వంటగది నుంచి రజో, తమోగుణం కలిగిన శక్తులు వెలువడుతాయి. పూజాగది నుంచి సాత్వికమైన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ రెండు శక్తులు సమీపంలో ఉంటే పరస్పర సంఘర్షణ ఏర్పడి ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పూజామందిరాన్ని వంటగదికి దూరంగా ఏర్పాటు చేయాలి. వాస్తు ప్రకారం పూజాగది ఈశాన్య దిశలో ఉండటం ఉత్తమం. పూజాగదిలో ఒకే దేవుడి రెండు విగ్రహాలు పెట్టకూడదు. పూర్వీకుల ఫోటోలు అక్కడ ఉంచరాదు. శివలింగం, గణపతి, కుటుంబ దేవతలను భక్తితో ప్రతిష్ఠిస్తే ఇంట్లో శాంతి, శుభఫలితాలు కలుగుతాయి.

