ఏప్రిల్ 13 ప్రాముఖ్యత.. అసలు ఆరోజు ఏం జరగబోతోందో తెలిస్తే..?
నెలలోని ఏదో ఒక రోజుకు మాత్రం జోతిష్య రీత్యా చాలా ప్రాధాన్యముంటుంది. అదేంటో తెలుసుకుని ఆ రోజున ఏం చేయాలో తెలుసుకుంటే మనకు అంతా మంచే జరుగుతుంది. ఇక నేడు అంటే ఏప్రిల్ 13న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఇదే రోజున బుధుడు కూడా మేషరాశిలో సంచరించనున్నాడు. అంటే రెండు గ్రహాలు కలవబోతున్నాయి. ఈ కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం కలగనుందట. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుందట. మరి ఆ రాశులేంటి? వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది?
ముఖ్యంగా మేషరాశి వారు బుధాదిత్య రాజయోగం వలన ప్రయోజనం పొందుతారట. అది కూడా ప్రత్యేక ఆర్థిక ప్రయోజనమట. ఈ రాశి వారు కొత్తగా దేనిలోనైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోయి లాభాల పంట పండుతుందట. పెద్ద వ్యాపారాలు చేసే వారికి విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులొస్తాయట. సింహరాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుందట. వీరు కూడా ఆర్థికంగా లాభ పడతారట. వీరి ఇంట అనేక శుభకార్యాలు జరగడం పక్కా అని తెలుస్తోంది. అలాగే ఏదైనా సంస్థలో పెట్టుబడులు కూడా పెడతారట. ఈ రెండు రాశుల వారికి రాజయోగం ఖాయమట.