కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6:46 గంటలకు ప్రారంభమై 12వ తేదీ సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏ పండుగైనా జరుపుకుంటాం కాబట్టి నవంబర్ 12న ఉత్థాన ఏకాదశి జరుపుకుంటాం. కాబట్టి ఉత్థాన ఏకాదశిని ఉపవాసం 12న ప్రారంభించి 13వ తేదీ ఉదయం 6:42 నుండి 8:51 వరకు ఉత్థాన ఏకాదశి వ్రతం విరమించవచ్చు. ఈ రోజున తులసి కల్యాణం నిర్వహిస్తారని ముందుగానే చెప్పుకున్నాం. తులసి కల్యాణం నిర్వహించడం వలన వివాహ అడ్డంకులన్నీ తొలగిపోతాయిట.
తులసి మొక్కకు పచ్చి పాలలో చెరుకు రసం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని చెబుతారు. కాబ్టటి ఈ రోజున శ్రీహరిని పూజించుకుని స్వామివారికి పుసుపు, కుంకుమ, పుష్పాలతో పూజించుకుని నైవేద్యంగా పులిహోర, లడ్డు తదితర స్వీట్స్‌ను సమర్పించాలి. ఉత్థాన ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఆవు పాలతో శంఖాన్ని శుద్ధి చేసి అనంతరం గంగాజలంతో స్నానం చేయించి విష్ణుమూర్తికి సమర్పిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. విష్ణుమూర్తిని పూజించే సమయంలో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిదట.