శని బాధలన్నీ పొగొట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదించే శనీశ్వరుడెక్కడ ఉన్నాడంటే..

పరమేశ్వరుడు, శనీశ్వరుడు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రమే తిరువారూర్ శనీశ్వర క్షేత్రం. తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొళ్లికాడులో ఉందీ ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు అగ్నీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. శనీశ్వరుడు శని ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తున్నాడని విశ్వాసం. ఏలినాటి శని అనే దశ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి 30 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఈ సమయంలో వారికిది చాలా క్లిష్టమైన దశ. మొదటి దశను ‘వ్యయ’ దశ తమిళంలో ‘మంగు’ దశ అని.. రెండో దశను ‘జన్మ,’ తమిళంలో ‘పొంగు’ అంటారు. ఇక మూడవదే చివరి దశ.. దీనిని ‘ద్వితీయ’ దశ అని.. తమిళంలో అయితే ‘మరణ’ శనిగా పిలుస్తారు.

శని బాధలన్నీ పొగొట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదించే శనీశ్వరుడెక్కడ ఉన్నాడంటే..
శని బాధలన్నీ పొగొట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదించే శనీశ్వరుడెక్కడ ఉన్నాడంటే..

ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగే ఈ ఏలినాటి శని దశలో మహామహులైన శివుడు, ధర్మరాజు, నల చక్రవర్తుల వంటివారే ఎన్నో అవస్థలు పడ్డారట. ఇక సాధారణ వ్యక్తుల సంగతేంటి? ఈ దశలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటాయి. వీటిని అధిగమించడం చాలా కష్టమని కూడా చెబుతారు. దీనికి పరిష్కారం లేదా? అంటే దీనికి శనీశ్వరుడిని దర్శించుకుని పూజించుకోవడమే. అయితే తమిళనాట వెలసిన పొంగు శనీశ్వర ఆలయంలో కొలువైన శనీశ్వరుని దర్శించి పూజిస్తే కష్టనష్టాలు తొలగి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం.

Share this post with your friends