చందిప్ప క్షేత్రం విశిష్టత ఏంటంటే..

హైదరాబాద్‌కు 48 కి.మీ దూరంలో చందిప్ప అనే గ్రామంలో పర్లి వైద్యనాథుడిని పోలిన మరకత శివలింగం దర్శనమిస్తుంది. సాధారణంగా ఎక్కడైనా శివలింగం.. పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం వంటి అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. వాటిలో మరకత లింగం అనేది ముదురు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ మరకత శివలింగాలు చాలా అరుదు. అలాంటి అరుదైన మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రంలో ఉంది. ఇది ఈనాటిది కాదు. దీనికి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలంలో క్రీ.శ. 1076–1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది.

చందిప్ప క్షేత్రం విశిష్టత ఏంటంటే..
చందిప్ప క్షేత్రం విశిష్టత ఏంటంటే..

క్రీ.శ. 1101 కార్తిక శుద్ధ పంచమి గురువారం ఈ క్షేత్రంలో మరకత శివలింగ ప్రతిష్ఠాపనోత్సవాన్ని నిర్వహించారు. ఈ విషయం ఆలయంలో లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తోంది.
11వ శతాబ్దం నాటికి ఈ ప్రాచీన ఆలయం కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకోవడంతో సుమారు పదిహేను సంవత్సరాల క్రితం కొందరు భక్తులు పూనుకుని మరకత సోమలింగేశ్వర స్వామికి నూతన గర్భగుడిని నిర్మించారు. ఆలయాన్ని సైత పునరుద్ధరించారు. శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి ఈ మరకత శివలింగానికి నియమానుసారం ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ అభిషేకించి, అర్చిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు.

Share this post with your friends