శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయ విశేషాలేంటంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా నందలూరులో ఈ సౌమ్యనాథ స్వామి క్షేత్ర విశేషాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయం అచ్చుగుద్దినట్టుగా తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పోలినట్టుగా ఉంటుంది. ఇక్కడి గర్భగుడిలోని సౌమ్యనాథస్వామి విగ్రహం ఏడు అడుగుల ఎత్తుతో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ గుడిని ఒకప్పుడు అన్నమాచార్యులు సైతం దర్శించుకునే వాడని చెబుతారు. స్వామిపైన పదహారు కీర్తనలు కూడా ఇక్కడ రాశాడని అంటారు. గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉంటుంది. అయినా కూడా ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయ విశేషాలేంటంటే..
శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయ విశేషాలేంటంటే..

అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు కూడా పడుతుంటాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ గుడికి వచ్చిన భక్తులు మనసులో ఏదైనా కోరిక కోరుకుని స్వామిని ధ్యానిస్తూ తొమ్మిదిసార్లు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక చాలా తక్కువ సమయంలో నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అలా కోరిక నెరవేరిన భక్తులు తిరిగి ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అంతటి మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు.. నందలూరుకు చేరుకుంటే అక్కడి నుంచి కేవలం రెండు కిలో మీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది.

Share this post with your friends