శ్రీరాముడి జన్మస్థం అయోధ్య. మరి సీతమ్మ జన్మస్థలమేంటి? ఎక్కడ ఉంది? తెలుసుకుందాం. నేపాల్ దేశంలోని మధేష్ ప్రావిన్స్‌లో ధనుష జిల్లాలో ఉంది. ఇది ఖాట్మండుకు ఆగ్నేయంగా సుమారు 123 కి.మీ దూరంలో, భారతదేశ సరిహద్దుకు సమీపంలో ఉంది. జనక్‌పూర్‌లో జానకీ మందిరం ఉంది. జనక్ పూర్ అంటే సీతమ్మ తల్లి జన్మించిన ప్రదేశం. అలాగే స్వయంవరంలో గెలిచి ఇక్కడే శ్రీ రాముడు సీతమ్మను వివాహం చేసుకున్నాడు. నేటికీ జనక్ పూర్‌లో సీతారాముల వివాహ వేదిక ఉంది. దీనితో పాటు జానకీ ఆలయాన్ని నేపాల్ రాజధాని ఖాట్మండ్‌కు కేవలం ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకే భక్తులు వెళుతుంటారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

బీహార్‌లోని దర్భాంగ జిల్లాలో రామాయణంతో ముడిపడిన మరో పవిత్ర ప్రదేశం ఉంది. అదే అహల్య స్థాన్. ఇది రామాయణ గాథతో ముడిపడిన పుణ్యక్షేత్రమిది. విశ్వామిత్రుని యాగ రక్షణార్థం ఆయనతో కలిసి యాగరక్షణకు శ్రీరాముడు బయల్దేరడం గురించి హిందువులందరికీ తెలిసిందే. అయితే మార్గం మధ్యలో గౌతముడి భార్య అయిన అహల్యను శ్రీరాముడు కటాక్షిస్తాడు. విశ్వామిత్రునితో కలిసి వెళుతున్న ప్రదేశంలోనే గౌతముని శాపవశాత్తూ రాయిగా మారిన అహల్య శ్రీరాముని పవిత్ర పాదస్పర్శతో తిరిగి తన పూర్వ రూపాన్ని పొందుతుంది. దీనికి ప్రతీకగానే ఇక్కడ శ్రీరాముడు, అహల్య దేవికి ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సకల పాపాలు, శాపాలు తొలగుతాయని విశ్వాసం.
